

దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా, పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆకాశంలో ఒక తార’కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాను వీక్షించిన పలువురు సినీ ప్రముఖులు చిత్రబృందంపై అభినందనలు కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి, నాని సైతం సినిమాను మెచ్చుకోగా.. తాజాగా ఈ జాబితాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరారు. సినిమా కథ, నటీనటుల ప్రతిభపై ఆయన ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లోనూ ఆసక్తి మరింత పెరుగుతోంది.
అసాధ్యమైన కలలు కనడం, వాటిని నిజం చేసుకోవడం అనే అద్భుతమైన ఆశయంతో రూపొందిన కథగా ‘ఆకాశంలో ఒక తార’ను కేటీఆర్ అభివర్ణించారు. ఈ మధ్యకాలంలో ఇంత అందమైన సినిమా చూడలేదని ప్రశంసించారు. దుల్కర్ సల్మాన్, శ్రుతిహాసన్ ఎప్పటిలాగే అద్భుతంగా నటించారని కొనియాడారు. తొలి సినిమాతోనే సత్తా చాటిన సాత్విక వీరవల్లి నటన తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మించిన ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి కథానాయికగా నటించగా, శ్రుతిహాసన్, రుహాని శర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!