

నేచురల్ స్టార్ నాని, కయాదు లోహర్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే ఉండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌పై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలను స్వల్పంగా పెంచుకునేందుకు మేకర్స్ అనుమతి కోరినట్లు ఇప్పటికే సమాచారం వచ్చింది. నైజాం మార్కెట్‌కు సంబంధించి కూడా హైక్ కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది.
తాజాగా నాని తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రజలను ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. దీంతో ది ప్యారడైజ్‌కు నైజాం ప్రాంతంలో టికెట్ ధరల పెంపు ఖరారైనట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రభుత్వం జారీ చేయాల్సిన జీవో రావాల్సి ఉంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నిర్మిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!