

హీరో సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘సుధీర్ జోకర్’ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఈ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఈ సినిమాలో అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు.

సుడిగాలి సుధీర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. ప్లేయింగ్ కార్డ్స్‌తో స్టైలిష్ లుక్‌లో కనిపించిన సుధీర్ అభిమానులను ఆకర్షిస్తున్నారు. రేపు ప్రత్యేకంగా “బాంగర్ రిలీజ్”తో పాటు అభిమానులతో ఇంటరాక్షన్ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!