

బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు విక్రమ్ భట్ మరియు ఆయన భార్య శ్వేతాంబరి భట్ రాజస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దంపతులపై ₹30 కోట్లకు పైగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉదయ్‌పూర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఇందిరా IVF వ్యవస్థాపకుడు డాక్టర్ అజయ్ ముర్దియా… తన దివంగత భార్య జీవిత కథపై ఓ బిగ్-బడ్జెట్ బయోపిక్ తీయాలని విక్రమ్ భట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
“విరాట్” అనే టైటిల్‌తో రూపొందించే ఈ సినిమా ₹200 కోట్లకు పైగా కలెక్షన్స్ చేస్తుందని, ప్రాఫిట్లో భారీ షేర్ ఇస్తామని చెప్పి… ముర్దియా నుంచి దాదాపు ₹30 కోట్లు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. అయితే విక్రమ్ భట్ వైపు నుంచి మాత్రం భిన్నమైన వాదన వినిపిస్తోంది.
సినిమా మధ్యలోనే డాక్టర్ అజయ్ ముర్దియానే ప్రాజెక్ట్‌ను ఆపేసి, టెక్నీషియన్లు మరియు VFX టీమ్‌లకు ఇంకా ₹250 కోట్లకు పైగా పెండింగ్ బకాయిలు ఉన్నాయని… ఆ బకాయిల బాధ్యత నుంచి తప్పించుకోవడానికే తనపై తప్పుడు కేసు పెట్టించారంటూ విక్రమ్ భట్ కౌంటర్ ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దంపతులను ముంబై నుండి ట్రాన్సిట్ రిమాండ్‌పై ఉదయ్‌పూర్‌కు తరలిస్తున్నారు.
మీడియాతో మాట్లాడిన విక్రమ్ భట్…
“నేను పూర్తిగా పోలీసులకు సహకరిస్తాను. నా దగ్గర ఉన్న అన్ని ఒరిజినల్ అగ్రిమెంట్లు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ రికార్డులు చూపిస్తాను. నిజం త్వరలో బయటపడుతుంది” అని అన్నారు.


_1771477764226.jpg&w=3840&q=75)













కామెంట్స్ (1)
సంచలనం!