
టెక్నాలజీ

శివ చౌదరి, జశ్విక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘ఒక్క చూపుతో మొదలైన...’ చిత్రానికి నూతలపాటి చెంచయ్య దర్శకత్వం వహిస్తుండగా, బిందు సారధి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ నటులు శ్రీకాంత్, శివాజీ రాజా ఆవిష్కరించారు. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొని సినిమా విశేషాలను పంచుకుంది.
ఈ సందర్భంగా నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ, ట్రైలర్ చూస్తుంటే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో రూపొందినట్లు కనిపిస్తోందన్నారు. ప్రస్తుతం వస్తున్న సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం ఉండబోతుందని పేర్కొన్నారు. దర్శకుడు చెంచయ్య, నిర్మాత బిందు సారధి మాట్లాడుతూ, మంచి కథాంశం మరియు భావోద్వేగాలతో కూడిన చిత్రంగా దీనిని తెరకెక్కించినట్లు తెలిపారు. ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!