
జనరల్

దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతున్న ‘వందే భారతం’ కార్యక్రమానికి ఇప్పటివరకు 25 వేలకుపైగా దరఖాస్తులు అందాయి. కార్యక్రమానికి ప్రజల నుంచి లభిస్తున్న విశేష స్పందనను దృష్టిలో ఉంచుకుని దీన్ని మరింత విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో అదానీ గ్రూప్ ప్రతినిధులు గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్యక్రమం పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ‘వందే భారతం’ స్మారక చిహ్నాన్ని అందజేయడంతో పాటు గౌతమ్ అదానీ సందేశంతో కూడిన ప్రత్యేక లేఖను కూడా అందించారు. దేశవ్యాప్తంగా మరింత మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ప్రజల్లో అవగాహన పెంచేందుకు సమిష్టి కృషి కొనసాగిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!