
జనరల్

భవనాల్లో అమర్చిన లిఫ్ట్‌లలో ప్రమాదాలు జరిగితే బాధ్యతను ఒక్కరిపైనే మోపలేమని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. లిఫ్ట్ తయారీదారు, నిర్వహణ సంస్థ, భవన యాజమాన్యం ముగ్గురూ సంయుక్తంగా బాధ్యత వహించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.
జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం లిఫ్ట్‌ను భవనాల్లోని సాధారణ ప్రజా రవాణా సాధనంగా అభివర్ణించింది. ప్రజలు లిఫ్ట్‌లోకి అడుగు పెట్టిన క్షణం నుంచి తమ ప్రాణాలను, భద్రతను ఆ యాంత్రిక వ్యవస్థపై నమ్మకంతో అప్పగిస్తారని పేర్కొంది. ప్రయాణికుల భద్రతను కాపాడటం తయారీదారు, నిర్వహణ సంస్థ, భవన యాజమాన్యం ముగ్గురి ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!