

‘కోర్ట్’ సినిమాతో ఒక్కసారిగా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి శ్రీదేవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తొలి సినిమానే మంచి విజయాన్ని అందుకోవడంతో ఆమెకు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత నటించిన ‘బ్యాండ్ మేళం’ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా, శ్రీదేవి క్రేజ్ మాత్రం కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న ఆమె ‘హైకూ’తోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా శ్రీదేవి తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఈ సినిమా ప్రేమ, పాత జ్ఞాపకాలు, చెరిగిపోని భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు ఆమె షేర్ చేసిన ప్రకటన ద్వారా తెలుస్తోంది. ఇందులో శ్రీదేవి, ఆకాష్ ప్రేమ్‌కుమార్ జంటగా నటించనున్నారు. ముత్తురామ్ మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎంఆర్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 2గా రూపొందుతోంది. త్వరలోనే సినిమా షూటింగ్ తేదీలను ప్రకటించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!