

ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘శ్రీ చిదంబరం గారు’ సినిమా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటూ ప్రశంసలు అందుకుంటోంది. శ్రీమతి చింతా వరలక్ష్మీ సమర్పణలో, శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చింతా వినీష్ రెడ్డి, చింతా గోపాల కృష్ణారెడ్డి నిర్మాతలుగా రూపొందిన ఈ చిత్రానికి వినయ్ రత్నం దర్శకత్వం వహించారు. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 6 న విడుదలై మంచి స్పందన పొందింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బ్లాక్‌బస్టర్ థ్యాంక్స్ మీట్‌ను నిర్వహించింది.
థ్యాంక్స్ మీట్లో దర్శకుడు వినయ్ రత్నం, నిర్మాతలు, నటీనటులు సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న సానుకూల స్పందన తమకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని తెలిపారు. కొత్త టీమ్‌తో చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించడంపై నిర్మాతలు సంతోషం వ్యక్తం చేయగా, నటీనటులు తమ పాత్రలకు వస్తున్న ప్రశంసలపై కృతజ్ఞతలు తెలిపారు. క్లీన్ మరియు రిఫ్రెషింగ్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా ప్రతి ఒక్కరి మనసును తాకుతుందని చిత్ర బృందం విశ్వాసం వ్యక్తం చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!