

శ్రీముఖి నటిగా, యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వ్యక్తిగా టాలీవుడ్‌లో కొనసాగుతోంది. కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో నటించినప్పటికీ, యాంకరింగ్ వైపు మళ్లిన తర్వాత ఆమెకు భారీ గుర్తింపు దక్కింది. తన చలాకీతనం, మాటతీరు, ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ టాప్ యాంకర్లలో ఒకరిగా నిలిచింది. ప్రస్తుతం కూడా సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూ, యాంకరింగ్‌లో తన ప్రాధాన్యతను కొనసాగిస్తోంది.
ఇటీవల శ్రీముఖి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఆమె పట్టు చీరలో ఎంతో ఎలిగెంట్‌గా కనిపించింది. అందమైన బ్లౌజ్, చేతినిండా గాజులు, ఉంగరం, పెద్ద చెవిపోగులు, నుదుటిన బొట్టు వంటి ఆభరణాలతో సంప్రదాయ అందాన్ని ప్రదర్శించింది. అలాగే జుట్టును అందంగా ముడివేసి పూలతో అలంకరించుకోవడం ఆమె లుక్‌కు మరింత ఆకర్షణను తీసుకొచ్చింది. ఈ ట్రెడిషనల్ అవతార్ అభిమానులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!