
గాసిప్స్

పరాశక్తి చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన శ్రీలీల మరో తమిళ సినిమాకు ఒప్పుకుందా అనే సందేహాలు గత కొన్ని రోజులుగా వినిపించాయి. ఇప్పుడు ఆ ఊహలకు ముగింపు పలుకుతూ, తన తదుపరి తమిళ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది శ్రీలీల.
ధనుష్ కథానాయకుడిగా, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రంలో ఆమె కథానాయికగా నటించనుంది. ప్రస్తుతం డీ55 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇది ఓ అందమైన ప్రేమకథగా తెరకెక్కనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి.
ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం శనివారం సోషల్‌మీడియాలో కొన్ని ఫొటోలను పంచుకుంది. ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్ స్వరాలు అందించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో కోలీవుడ్‌లో శ్రీలీల స్థానం మరింత బలపడనుందని అభిమానులు భావిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!