
సినిమాలు

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘మెలోడీ’ ట్రెండ్‌లో బాలీవుడ్ స్టార్ జంట సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ కూడా చేరిపోయారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి ‘మెలోడీ’ చాక్లెట్లు బహుమతిగా ఇచ్చిన వీడియో వైరల్ కావడంతో ఈ ట్రెండ్ మరింత పాపులర్ అయింది. ఈ క్రమంలో సోనాక్షి, జహీర్ కలిసి చేసిన ఫన్నీ రీల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
‘ఇన్ ఏ ప్యారలల్ యూనివర్స్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన వీడియోలో సోనాక్షి తన భర్తను “నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో చెప్పు” అని అడగగా.. జహీర్ డ్రామాటిక్‌గా ‘మెలోడీ’ టాఫీ తీసి “మెలోడీ ఖావో.. ఖుద్ జాన్ జావో” అంటూ ఫన్నీగా స్పందించాడు. చివర్లో సోనాక్షి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతున్నాయి. ఈ వీడియోకు అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!