

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రంలోని ‘హల్లల్లల్లో’ పాటతో గాయని రక్షితా సురేశ్ సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఆదివారం విడుదలైన ఈ ప్రత్యేక గీతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరాంధ్ర యాసలో సాగే ఈ పాటలో రక్షిత తన గమ్మత్తైన గాత్రంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్న ఆమె కర్ణాటక, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంతో పాటు లైట్ మ్యూజిక్‌లో శిక్షణ పొందారు.
మైసూరుకు చెందిన రక్షితా సురేశ్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంలోని ‘చల్లగాలి తాకుతున్న’ పాటతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ‘లవ్ స్టోరీ’లోని ‘ముత్యాల చెమ్మ చెక్క’ పాటతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో ‘పొన్నియిన్ సెల్వన్’, ‘మామన్నన్’, ‘ఆడు జీవితం’, ‘థగ్ లైఫ్’ వంటి చిత్రాల్లో ఆమె పాడిన పాటలు మంచి ఆదరణ పొందాయి. ‘హల్లల్లల్లో’ పాటతో మరోసారి తన గాత్ర వైవిధ్యాన్ని చాటుకున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!