

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. శింగనమల బెబ్బులి రణబాలిగా పవర్‌ఫుల్ పాత్రలో విజయ్ కనిపించనుండగా.. ఆయనతో తలపడే క్రూరమైన బ్రిటిష్ అధికారి సర్ థియోడర్ హెక్టర్‌గా హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ నటిస్తున్నారు. ‘ది మమ్మీ’ చిత్రాల్లో ఇమ్హోటెప్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వోస్లూకు ఇదే తొలి భారతీయ సినిమా. దీంతో ఆయన టాలీవుడ్ ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా మారింది.
దక్షిణాఫ్రికాలోని ఆల్బర్టన్‌లో జన్మించిన ఆర్నాల్డ్ వోస్లూకు చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి పెరిగింది. ఆయన తల్లిదండ్రులు రంగస్థల నటులు కాగా.. తండ్రి డ్రైవ్-ఇన్ థియేటర్ నిర్వహించేవారు. హాలీవుడ్‌లో ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ ‘ది మమ్మీ’ ఫ్రాంచైజీ ఆయనకు ప్రపంచవ్యాప్త స్టార్‌డమ్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు 60కి పైగా సినిమాలు, టీవీ ప్రాజెక్టుల్లో నటించిన ఆయన నిర్మాతగా, వాయిస్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేశారు. ‘రణబాలి’లో సర్ థియోడర్ హెక్టర్ పాత్రను దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఈ పాత్రకు వోస్లూ పోషించిన ఇమ్హోటెప్ పాత్రే స్ఫూర్తిగా నిలిచిందని సమాచారం. ఆసక్తికరంగా, అమెరికన్ నటుడు బిల్లీ జేన్‌తో పోలికలు ఉండటంతో చాలాసార్లు అభిమానులు వోస్లూను ‘టైటానిక్’ నటుడిగా పొరబడేవారు. వోస్లూకు దక్షిణాఫ్రికాతో పాటు అమెరికా పౌరసత్వం కూడా ఉంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!