

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పిరియాడిక్ యాక్షన్ డ్రామా ‘లవ్ అండ్ వార్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా థియేట్రికల్ హక్కుల వ్యాపారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పెన్ మరుధర్ సంస్థ ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను సుమారు రూ.300 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. హక్కుల కోసం పలు సంస్థలు పోటీ పడగా, భన్సాలీకి అత్యధిక బిడ్ అందించిన సంస్థకే హక్కులు లభించినట్లు తెలుస్తోంది.
‘లవ్ అండ్ వార్’ను 2027 జనవరి 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన లభించింది. దీపావళి సందర్భంగా టీజర్‌ను విడుదల చేయాలని భన్సాలీ భావిస్తున్నట్లు సమాచారం. ‘రామాయణ’ సినిమా ప్రింట్లతో పాటు థియేటర్లలో ‘లవ్ అండ్ వార్’ టీజర్‌ను ప్రదర్శించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో సినిమా విడుదల తేదీతో పాటు టీజర్‌పై కూడా ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!