

ఫ్లైదుబాయ్ విమానంలో ఎదురైన తీవ్ర ప్రమాద సమయంలో భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్ గాయపడినా పరిస్థితిని ఎదుర్కొని ప్రయాణికుల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలో కాక్‌పిట్‌లో జరిగిన దాడిలో మచ్చర్ గాయపడ్డారు. అయినప్పటికీ ఆయన పోరాడటంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం విమానం సౌదీ అరేబియాలోని తబుక్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో ఉన్న 174 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ఘటన నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన నీర్జా భనోట్ సాహసాన్ని మరోసారి గుర్తుచేసింది. 1986 సెప్టెంబర్ 5న కరాచీలో పాన్ ఆమ్ ఫ్లైట్ 73ను నలుగురు సాయుధ ఉగ్రవాదులు హైజాక్ చేసిన సమయంలో సీనియర్ ఫ్లైట్ పర్సర్‌గా ఉన్న నీర్జా సమయస్ఫూర్తితో కాక్‌పిట్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అమెరికా ప్రయాణికుల పాస్‌పోర్టులను దాచిపెట్టి, విమానం నుంచి ప్రయాణికులను బయటకు పంపే క్రమంలో ముగ్గురు చిన్నారులను తూటాల నుంచి కాపాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆమె ధైర్యానికి మరణానంతరం అశోక చక్ర పురస్కారం లభించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!