

బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న డెమాన్ పవన్, రీతూ చౌదరి తమ సన్నిహిత స్నేహంతో కూడా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీరిద్దరూ కలిసి ఈవెంట్లకు హాజరవుతూ, పలు ప్రాజెక్టుల్లో భాగమవుతూ కనిపించారు. అయితే తాజాగా డెమాన్ పవన్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.
తాము ప్రేమికులు కాదని, తమ గురించి నెటిజన్లు రకరకాలుగా అనుకుంటూ పుకార్లు ప్రచారం చేస్తున్నారని డెమాన్ పవన్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. తమ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, ఆ పరిస్థితులను తాను కూడా భరించలేకపోతున్నానని తెలిపాడు. రీతూ తనను సోషల్ మీడియాలో అన్ని చోట్లా బ్లాక్ చేసిందని, తాను కూడా ఆమెను బ్లాక్ చేశానని చెప్పాడు. తమ స్నేహ బంధం ముగిసిందని, ఇకపై ‘రివన్’ కాంబో ఉండదని, ఇద్దరూ తమ తమ దారుల్లో ముందుకు సాగుతామని స్పష్టం చేశాడు. రీతూ చేసినట్టుగా తాను ఇన్‌స్టాగ్రామ్‌లో తమ ఫొటోలను డిలీట్ చేయబోనని కూడా పవన్ పేర్కొన్నాడు. దీంతో ఈ పోస్ట్ ఒక్కసారిగా వైరల్ అయింది. తాజాగా ఈ వివాదంపై రీతూ చౌదరి స్పందించడంతో మరోసారి వీరిద్దరి స్నేహంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
పవన్ పోస్ట్‌పై నెటిజన్లు, మీడియా ప్రశ్నించగా రీతూ చౌదరి ఘాటుగా స్పందించింది. తామిద్దరూ ప్రేమికులు కాదని, పెళ్లి కూడా చేసుకోలేదని.. అలాంటప్పుడు ‘బ్రేకప్’ అంటూ ఇంత రచ్చ చేయడం ఎందుకని ప్రశ్నించింది. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహమేనని, స్నేహితుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు, గొడవలు సహజమేనని తెలిపింది. “మీ ఫ్రెండ్స్‌తో మీకు గొడవలు అవ్వవా? వాడు ఏదో పోస్ట్ చేశాడు.. దానికి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది?” అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొంది. ఇదే సమయంలో ఈ వివాదం కారణంగా ఒక్క రోజులోనే 25 వేల మంది ఫాలోవర్లు పెరిగారని, అందుకు థ్యాంక్యూ అంటూ రీతూ వ్యంగ్యంగా స్పందించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!