

సుడిగాలి సుధీర్ నటిస్తున్న తాజా సినిమా ‘G.O.A.T’ ప్రస్తుతం షూటింగ్ దశలోనే హాట్ టాపిక్ అయ్యింది. దివ్య భారతి హీరోయిన్గా నటిస్తుండగా, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. టీజర్ రిలీజ్ సందర్భంగా జరిగిన ఈవెంట్లో చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సందడి రేపాయి. ‘‘ఒక టాలీవుడ్ హీరో నా రెండు సినిమాల్లో పెద్ద నష్టం చేశాడు’’ అంటూ, బడ్జెట్‌ను మూడింతలు పెంచడం, హీరోయిన్ సీన్స్ తొలగించడం, హీరోను డామినేట్ చేసేలా మార్పులు చేయడం వంటి షాకింగ్ విషయాలను ఆయన వెల్లడించారు. అయితే ఆ హీరో పేరును బయటపెట్టలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ ఆ హీరో ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా, డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా హీరో సుధీర్ మరియు దర్శకుడు టీజర్ ఈవెంట్‌కు హాజరుకాలేకపోయారు అనేది మరో చర్చ. హీరోయిన్ను ‘చిలుక’ అని పిలిచిన ఘటన తర్వాత వచ్చిన విమర్శల నేపథ్యంలో మీడియా ప్రశ్నలు తప్పించుకోవడానికే రాలేదేమో అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిర్మాత మాత్రం సుధీర్‌పై పూర్తి నమ్మకం ఉంచుతున్నానని, కష్టపడి పైకి వచ్చిన మంచి వ్యక్తి కావడంతోనే హీరోగా ఎంపిక చేశానని చెప్పాడు. ప్రస్తుతం ‘G.O.A.T’ కి సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఛాంబర్ పరిధిలో కొనసాగుతున్నాయని, నిర్ణయం వచ్చాకే తదుపరి అప్డేట్ ఇస్తామన్నారు.




















కామెంట్స్ (1)
‘G.O.A.T’ రిలీజ్‌కు ముందే ఇలా వార్తల్లో నిలవడం నిజంగా హాట్ టాపిక్.