

శర్వానంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’ నుంచి మరో పాట విడుదలైంది. ‘ఎగిలి వారంగాలేసి..’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో తెలంగాణ పల్లెల ప్రకృతి అందాలను, గ్రామీణ ప్రజల జీవనశైలిని ప్రతిబింబిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పల్లె వాతావరణం, సంప్రదాయాలు, అక్కడి మనుషుల జీవన విధానాన్ని చూపించేలా రూపొందించిన ఈ పాట ప్రేక్షకులకు తమ సొంత ఊరి జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఉంది.
‘ఎగిలి వారంగాలేసి..’ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, చంద్రబోస్ సాహిత్యం సమకూర్చారు. నల్గొండ గద్దర్ నరసన్న, కందుకూరి శంకర్‌బాబు, రేలారే గోపాల్ ఈ పాటను ఆలపించారు. తెలంగాణ పల్లెల అందాలు, గ్రామీణ జీవనశైలిని తెరపై ఆవిష్కరించే ఈ జానపద గీతం ఇప్పటికే ఆసక్తిని పెంచుతోంది. సహజమైన పల్లె వాతావరణం, మనసుకు హత్తుకునే భావాలతో రూపొందిన ఈ పాట శ్రోతలను తమ ఊరి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లేలా ఉంది. నవంబరు 12న విడుదల కానున్న ‘భోగి’పై ఈ పాటతో మరింత ఆసక్తి నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!