

యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'శంబాల: ఇటీవలే ఈ సినిమా ట్రయిలర్ వచ్చి అందరినీ ఆకట్టుకుంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ తదితరులు నటిస్తున్నారు. ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో చిత్ర యూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో..
హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ .. ' మేం సినిమా మీద బజ్‌ను క్రియేట్ చేసే క్రమంలోనే ట్రైలర్‌ను ఇంత త్వరగా రిలీజ్ చేశాం. ఇండస్ట్రీ సెలబ్రిటీల నుంచి మీడియా నుంచి కూడా మాకు మంచి సపోర్ట్ లభిస్తోంది. మా నిర్మాతలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని నిర్మించారు. గంధర్ ఈ మూవీని అద్భుతంగా రూపొందించారు. డిసెంబర్ 25న మా చిత్రాన్ని రిలీజ్ చేయబోతోన్నాం. మా చిత్రం కచ్చితంగా ఏ ఒక్కరినీ నిరాశపర్చదు. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. కంటెంట్ బాగుంటేనే జనాలు థియేటర్లకు వస్తున్నారు. ఇలాంటి ఓ డిఫరెంట్ కంటెంట్ మూవీని మీడియా, ఆడియెన్స్ ఆదరిస్తారని, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను' అని అన్నారు.
దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ .. 'శివుడు ఆశీస్సులతో మా 'శంబాల'కు అంతా పాజిటివిటీనే ఎదురవుతోంది. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. టెక్నికల్‌గా ఎంతో గొప్ప స్థాయిలో ఉంటుంది. ట్విస్ట్, టర్న్స్ ఇలా అన్నీ అద్భుతంగా ఉంటాయి. ప్రతీ పాత్ర ఆడియెన్స్‌కి అలా గుర్తుండిపోతుంది. ప్రతీ ఒక్కరూ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశారు. బడ్జెట్ పెరుగుతున్నా కూడా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నాకు సపోర్ట్‌గా నిలిచారు అని అన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!