
జనరల్

బాలీవుడ్లో వరుస సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా జాన్వీ కపూర్‌కు సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్లో సినిమాలు చేస్తున్న ఆమె ఇప్పుడు కోలీవుడ్‌లో కూడా కీలక ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది. ధృవ్ విక్రమ్ హీరోగా తెరకెక్కనున్న భారీ యాక్షన్ డ్రామాలో జాన్వీ హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం.
మొదట ఈ పాత్రకు రుక్మిణి వసంత్‌ను తీసుకోవాలని భావించినప్పటికీ ఆమె తప్పుకోవడంతో జాన్వీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కథ విన్న వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ జాన్వీ కెరీర్లో సౌత్‌లో బలమైన మలుపు కావచ్చని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!