

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. రాశి ఖన్నా, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది.
ఇటీవలే ‘దేఖ్ లేంగే సాలా’ అంటూ సాగే లిరికల్ వీడియోను విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఆ పాట విజయంతో అభిమానుల్లో రెండో సాంగ్‌పై ఆసక్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పేరుతో రెండో పాటను ఫిబ్రవరి 22న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ ప్రకటనకు విడుదల చేసిన పోస్టర్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ పాట కూడా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుందనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. గతంలో పవన్ కళ్యాణ్–హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో, ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!