

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్యకు
విడాకులు ఇచ్చిన తర్వాత దాదాపు 4 సంవత్సరాల పాటు సింగిల్ లైఫ్ లీడ్ చేసిన సమంత, సోమవారం రోజున రెండో పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. రాజ్ నిడిమోరుతో చాలా రోజులుగా లవ్ లో ఉన్న సమంత, అతనితోనే పెళ్లి పీటలెక్కింది. సమంత, రాజ్ నిడిమోరు వివాహం చాలా సీక్రెట్ గా, సన్నిహితుల మధ్య జరిగింది. ఇక సమంత రెండో పెళ్లి గురించి సోమవారం సోషల్ మీడియా మొత్తం వార్తలు అవుతున్న నేపథ్యంలో అక్కినేని నాగచైతన్య షాకింగ్ పోస్ట్ చేశారు.
తన కెరీర్, సినిమా గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సృజనాత్మకమైన కథను ఎంచుకొని నిజాయితీగా నటిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారంటూ వ్యాఖ్యానించారు నాగచైతన్య. తాను నటించిన దూత సిరీస్ ఈ విషయాన్ని నిరూపించినట్లు తెలిపారు. దూత రిలీజ్ అయి రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ పోస్ట్ పెట్టారు.
ఈ ప్రాజెక్టులో నటించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దీంతో నాగచైతన్య చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. సమంత పెళ్లి రోజే, ఇలా రియాక్ట్ కావడం అవసరమా ? అని కొంతమంది అంటుంటే, మరికొంతమంది దూత కోసం మాత్రమే నాగచైతన్య స్పందించాడని అంటున్నారు. దూత సీజన్ 2 ఎప్పడంటూ మరి కొందరు రియాక్ట్ అవుతున్నారు. కాగా చైతూ కూడా శోభితాను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.










కామెంట్స్ (2)
Interesting news!
ఇక ‘దూత’ సీజన్ 2 కోసం కూడా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కనిపిస్తోంది!