
జనరల్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల చేసిన సోషల్ మీడియా పోస్ట్‌పై వైరల్ అయిన వార్తలకు స్వయంగా స్పందించారు. షర్ట్‌లెస్ ఫొటోతో పాటు పెట్టిన భావోద్వేగ క్యాప్షన్‌ను కొందరు తప్పుగా అర్థం చేసుకుని, ఆయన మానసిక ఒత్తిడిలో ఉన్నారని ప్రచారం చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వార్తలపై స్పందించిన సల్మాన్.. తన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. “ఇంత పెద్ద కుటుంబం, కోట్లాది అభిమానులు ఉన్నప్పుడు నేను ఎలా ఒంటరివాడిని అవుతాను?” అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. షూటింగ్స్ మధ్య తనకోసం కొంత సమయం కేటాయించుకోవడానికే ఆ పోస్ట్ పెట్టానని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!