

దిగ్గజ నటుడు నానా పటేకర్ మృతిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నానా పటేకర్ ఇకలేరనే విషయాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు. నానా పటేకర్ బలమైన స్క్రీన్ ప్రెజెన్స్, అసాధారణ నటనా ప్రతిభను గుర్తుచేసుకున్న ఆర్జీవీ.. అంతటి వ్యక్తి ఇంత అకస్మాత్తుగా దూరమవుతారని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన సంతాప సందేశంలో నానా పటేకర్‌ను ‘యాక్టింగ్ గాడ్’గా అభివర్ణిస్తూ, ఆయనను కోల్పోవడం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొన్నారు.
రామ్ గోపాల్ వర్మ, నానా పటేకర్ కాంబినేషన్‌లో ‘భూత్’, ‘డర్నా మనా హై’, ‘అబ్ తక్ ఛప్పన్’, ‘ది అటాక్స్ ఆఫ్ 26/11’ వంటి చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా ‘అబ్ తక్ ఛప్పన్’లో సాధు అగాషే పాత్రలో నానా పటేకర్ నటన విశేషంగా ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉండగా, గోవాలోని తన నివాసంలో కార్డియాక్ అరెస్ట్‌కు గురైన నానా పటేకర్‌ను మణిపాల్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినప్పటికీ కాపాడలేకపోయారు. ఆయనను ఉదయం 5:20 గంటలకు మృతుడిగా ప్రకటించినట్లు మణిపాల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!