
జనరల్

దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళిపై నాస్తికుడని విమర్శలు చేస్తున్న వారిని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా ఎత్తిపొడిచారు. దేవుడిని నమ్మని వ్యక్తి దేవుడిపై సినిమా ఎలా తీయగలడు అని ప్రశ్నిస్తున్నవారికి సూటిగా సమాధానం ఇచ్చారు.
సోషల్ మీడియాలో ఆర్జీవీ ఇలా రాశారు:
“దేవుడిని నమ్మని వ్యక్తి దేవుడిపై సినిమా తీయడమేంటని అంటున్నారు. అలా అయితే గ్యాంగ్‌స్టర్ సినిమా తీయాలంటే దర్శకుడు గ్యాంగ్‌స్టర్ అయి ఉండాలా? దేవుడిని నమ్మని వ్యక్తికి దేవుడు వంద రెట్లు ఎక్కువ సక్సెస్ ఇచ్చాడు. దేవుడికే అతనితో ఇబ్బంది లేకపోతే మీకెందుకు ఇబ్బంది?” అని వ్యాఖ్యానించారు.
ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తూ, ఆయన స్పష్టమైన లాజిక్‌ను పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.














కామెంట్స్ (2)
RGV raises a point, but the other side isn’t entirely wrong too.
రాజమౌళికి RGV మద్దతు లభించింది