

విక్రమ్, రమ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ “వెంకీ పింకీ జంప్” సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై వెంకట్, బాబా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్.యన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు వి.సముద్ర, బిగ్ బాస్ ఫేమ్ బెజవాడ బేబక్క, దర్శక నిర్మాత సాయివెంకట్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియో బిగ్ సీడీని విడుదల చేశారు.
.jpeg)
ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. నటుడు సతీష్ తాను తండ్రి పాత్రలో నటించానని, ఈ సినిమా తనకు మంచి పేరు తీసుకువస్తుందని అన్నారు. బేబక్క మాట్లాడుతూ హీరో విక్రమ్‌లో నిజాయితీ కనిపిస్తుందని, ఆనంద్ రాజా చేసిన పాటలు చాలా బాగున్నాయని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ ఆనంద్ రాజా మాట్లాడుతూ ఈ చిత్రానికి సంగీతం ఇవ్వడంతో పాటు పాటలకు లిరిక్స్ కూడా రాశానని, “వన్ టు త్రీ” పాట ప్రేక్షకులకు ప్రత్యేకంగా నచ్చుతుందని తెలిపారు. హీరో విక్రమ్ తనకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ, హీరోగా మంచి పేరు తెచ్చుకుంటానని భావోద్వేగంగా చెప్పారు. హీరోయిన్ రమ్య ఇది తన తొలి సినిమా అని, యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని అన్నారు.
దర్శకుడు అజయ్.యన్ మాట్లాడుతూ ఇది యూత్ ఫుల్ లవ్ స్టోరీ అని, టైటిల్ చూస్తేనే కథ అర్థమవుతుందని చెప్పారు. వెంకీ, పింకీ ప్రేమ కోసం ఊరి నుంచి పారిపోవడం, ఆ తర్వాత వారి ప్రేమ ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఆసక్తికరంగా చూపించామని తెలిపారు. అతిథిగా వచ్చిన దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ ఈ రోజుల్లో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదని, కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పారు. “వెంకీ పింకీ జంప్” సినిమా మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!