

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమాపై అభిమానుల్లో రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించనున్నట్లు సమాచారం. అయ్యప్ప భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన ‘బంగారు పల్లకి’ పాటను రీమిక్స్ చేయాలని చిత్రబృందం నిర్ణయించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ అధికారికంగా వెల్లడించడంతో సోషల్ మీడియాలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ మాస్ ఎనర్జీకి సరిపోయేలా ఈ పాటను కొత్తగా రూపొందిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ సినిమా కేవలం భక్తి నేపథ్యంలో మాత్రమే కాకుండా తండ్రీ–కూతుళ్ల భావోద్వేగ బంధాన్ని ప్రధానంగా చూపించనుంది. హీరోయిన్గా ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. భావోద్వేగం, యాక్షన్, భక్తి అంశాలను సమతూకంగా మేళవిస్తూ దర్శకుడు కథను రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. రవితేజ కెరీర్లో ఇది మరో బ్లాక్బస్టర్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!