

ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో కపుల్ ఫ్రెండ్లీ సినిమాను ప్రశంసిస్తూ ప్రత్యేకంగా పోస్టు చేశారు. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతోంది. తనకు వర్షం సినిమా ఎంత గుర్తుండిపోయిందో, అలాగే సంతోష్ శోభన్‌కు కపుల్ ఫ్రెండ్లీ కూడా గుర్తుండిపోయే సినిమా అవుతుందని ప్రభాస్ అన్నారు. ఇది చాలా అందమైన ప్రేమకథ అని, సినిమా చూస్తూ ఎంతో ఆనందించానని తెలిపారు. హీరో-హీరోయిన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని కూడా ఆయన ప్రశంసించారు.
దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ సినిమాను ఎంతో బాగా తెరకెక్కించారని, మంచి కథను తెరపైకి తీసుకొచ్చిన కో-ప్రొడ్యూసర్ అజయ్ కుమార్ రాజు పి మరియు యూవీ క్రియేషన్స్ కు ప్రభాస్ అభినందనలు తెలిపారు. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ఏపీ, తెలంగాణలో చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని పంపిణీ చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!