

ప్రభాస్ హీరోగా, రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రెబెల్’ 2012లో భారీ అంచనాల నడుమ విడుదలైంది. అయితే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉన్నప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. తాజాగా చిత్ర నిర్మాతలు జే. భగవాన్, జే. పుల్లారావు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా నిర్మాణ సమయంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా దర్శకుడు రాఘవ లారెన్స్‌తో పనిచేసిన సమయంలో ఎదురైన సవాళ్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ప్రారంభంలో నిర్ణయించిన బడ్జెట్లో సినిమాను పూర్తి చేస్తానని లారెన్స్ హామీ ఇచ్చారని తెలిపారు. అయితే సినిమా సగం పూర్తయ్యేలోపే ఆ బడ్జెట్ పూర్తిగా ఖర్చైందని వెల్లడించారు. దీంతో కొంత అసంతృప్తి కలిగినా, లారెన్స్ తన విజన్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని చెప్పారు. సినిమా వల్ల నష్టాలు వచ్చే అవకాశాలు ముందుగానే తెలిసినా, పూర్తి నమ్మకంతో ప్రాజెక్ట్‌ను కొనసాగించామని తెలిపారు. ఈ మొత్తం ప్రయాణంలో ప్రభాస్ తమకు ఎంతో సహకారం అందించారని నిర్మాతలు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!