

టాలీవుడ్ స్టార్ రష్మిక మందన్న ప్రస్తుతం మైసా చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, తాజాగా ఆమె షూటింగ్ స్పాట్ నుంచి ఓ ప్రత్యేక ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. “రక్తపు గుర్తులు కూడా దారిలోనే ఉన్నాయి” అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో ఈ పోస్టు అభిమానుల్లో భారీ చర్చకు దారి తీసింది.
ఈ చిత్రంలో రష్మిక ఇప్పటివరకు కనిపించని విధంగా ఓ పవర్‌ఫుల్ మాస్ పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అజయ్ సాయిపురెడ్డి, అనిల్ సాయిపురెడ్డి నిర్మిస్తున్నారు. గురు సోమసుందరం, ఈశ్వరి రావు, తారక్ పొన్నప్ప, నిధి సింగ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!