

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. తాజాగా చిత్రంపై మాట్లాడిన దర్శకుడు రాహుల్ సంకృత్యాన్, సినిమాలో ఎన్నో ఆకట్టుకునే సన్నివేశాలు ఉన్నప్పటికీ, విజయ్ దేవరకొండ మరియు విలన్ ఆర్నాల్డ్ వోస్లూ మధ్య సాగే క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని వెల్లడించారు.
ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను సుమారు 15 రోజుల పాటు చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు. ప్రేక్షకులను థ్రిల్ చేసే విధంగా ఈ సన్నివేశాన్ని రూపొందించామని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఇది ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే ‘టాక్సీవాలా’ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన విజయ్ దేవరకొండ–రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌పై మంచి నమ్మకం ఉండటంతో ‘రణబాలి’పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!