

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం NBK112 పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. అమరావతి పరిధిలోని వెంకటాయపాలెంలోని ప్రసిద్ధ టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తొలి క్లాప్ కొట్టగా, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బాలకృష్ణ కుమార్తె తేజశ్వని, నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, దర్శకుడు గోపీచంద్ మలినేని తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఎస్‌ఎల్‌వీ సినిమాస్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలయ్య మాస్ ఇమేజ్‌కు కొరటాల శివ సామాజిక సందేశాలతో కూడిన శక్తివంతమైన కథనాన్ని జోడించడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. “Power Meets Purpose, Mass Becomes a Movement” అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ రాజకీయ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!