
షోస్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ అక్టోబర్ 16, 2026న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ‘శ్యామ్ సింగ రాయ్’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పలు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. విజయ్, రష్మిక కాంబినేషన్ కావడంతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదల కానుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో చిత్రబృందం మీడియాతో సమావేశం కానుంది. సాయంత్రం 6:03 గంటలకు 3 నిమిషాల 47 సెకన్ల నిడివి గల ట్రైలర్‌ను డిజిటల్‌గా విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్–అతుల్ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!