

సినిమా ప్రమోషన్ అంటే ఎవరికీ ఒకే పద్దతి ఉండదు. కొందరు భారీగా ఖర్చు చేస్తారు, మరికొందరు మాత్రం సరైన టైమింగ్‌ని ఉపయోగిస్తారు. ఈ రెండు విధానాల్నీ కలిపి ఉపయోగించడం ఎవరికి బాగా వస్తుందంటే — దర్శకధీరుడు రాజమౌళికే.
బాహుబలికి ముందు వరకు తెలుగు మీడియాతో సన్నిహితంగా వున్న రాజమౌళి, ఆ తర్వాత బాలీవుడ్ మీడియాను టార్గెట్ చేసుకున్నారు. సినిమా రిలీజ్‌కి కొద్దిరోజుల ముందు బాలీవుడ్ జర్నలిస్టులకే చూపించి, వాళ్లతో న్యూస్ క్రియేట్ చేయించడం ఆయన స్టైల్ అయిపోయింది. ఇప్పుడు హాలీవుడ్ మీడియాకి కూడా అదే రేంజ్లో దగ్గరయ్యారు.
ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ షూట్లో బిజీగా ఉన్నారు. చాలా రోజులుగా ఈ సినిమా నుంచి ఎలాంటి అధికారిక అప్డేట్ లేకపోవడంతో అభిమానులు సోషల్ మీడియాలో అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. నవంబర్‌లో రాజమౌళి ప్రెస్ మీట్ పెడతారనే వార్తలు ట్రెండ్ అవుతుండగా, నిన్న రాత్రి ట్విట్టర్లో ఊహించని హడావుడి మొదలైంది.
మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా ముగ్గురి మధ్య జరిగిన ట్వీట్ చాటింగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ముందుగా మహేష్ బాబు “నవంబర్ వచ్చేసింది కదా” అని ట్వీట్ చేయగా, రాజమౌళి “అవును, రివ్యూలు ఇవ్వాలనుకున్న సినిమా మీకు ఇష్టమైన మహాభారతం అయి ఉండొచ్చు” అని జవాబిచ్చారు. మహేష్ వెంటనే, “అయితే మాట నిలబెట్టుకోండి, నవంబర్ వచ్చేసింది” అంటూ సవాల్ విసిరారు.
దానికి రాజమౌళి “ఇప్పుడే మొదలైంది… కొంచెం మెల్లగా అన్నీ రివీల్ చేద్దాం” అన్నారు. వెంటనే మహేష్, “ఎంత మెల్లగా? 2030లో మొదలు పెడదామా?” అని వెటకారం చేశారు. అప్పుడే ప్రియాంక చోప్రా ఎంటర్ అయి, “సెట్లో పంచుకున్న సీక్రెట్లు కూడా చెప్పేయనా?” అంటూ ట్వీట్ చేశారు.
దానికి రాజమౌళి “ప్రియాంకకు ఎందుకు చెప్పావ్? సర్ప్రైజ్ పాడు చేసావ్!” అని రిప్లై ఇవ్వగా, మహేష్ “సర్ప్రైజ్ నా? ప్రియాంకదీనా?” అంటూ హాస్యంగా ముగించారు.
ఈ చాటింగ్ మొత్తం స్క్రిప్టెడ్ అని ఫ్యాన్స్ కామెంట్స్‌తో నింపేశారు. కానీ ట్వీట్స్‌కి మిలియన్ల వ్యూస్ రావడంతో, రాజమౌళి ప్రోమోషన్ టాక్టిక్స్కి ఇది మరో ప్రూఫ్‌గా మారింది.










కామెంట్స్ (1)
Rajamouli always plays it smart