
గాసిప్స్

ప్రముఖ తెలుగు దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. తన తాజా చిత్రం ‘వారణాసి’ షూటింగ్‌కు కొద్దిసేపు విరామం ఇచ్చి, కుటుంబ సభ్యులతో కలిసి ఓ కుటుంబ వేడుకకు హాజరయ్యారు. రాజమౌళి బంధువు ఎంఎం శ్రీలేఖ ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. వాటిలో ఒకటి రాజమౌళితో దిగిన సెల్ఫీ కాగా, మరో ఫొటోలో ఆమె కుటుంబ సభ్యులు కనిపించారు.
ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తుండగా, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!