
జనరల్

పంజాబ్లో గాయని ఇందర్ కౌర్ కిడ్నాప్, హత్య ఘటన సంచలనం సృష్టించింది. ప్రేమను నిరాకరించడంతో సుఖ్విందర్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆరు రోజుల క్రితం అదృశ్యమైన ఇందర్ కౌర్ మృతదేహం తాజాగా ఓ కాలువలో లభ్యమైంది.
కెనడా నుంచి వచ్చిన సుఖ్విందర్ గాయనిని అపహరించి హత్య చేసిన అనంతరం తిరిగి కెనడాకు పారిపోయినట్లు సమాచారం. ఈ ఘటన పంజాబ్లో తీవ్ర కలకలం రేపగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!