16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వారణాసి మూవీ జర్నీపై ప్రియాంక చోప్రా కామెంట్స్

Writer: Pooja 02:46 PM, 16 సెప్టెంబర్, 2026
వారణాసి మూవీ జర్నీపై ప్రియాంక చోప్రా కామెంట్స్

ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంపై ప్రియాంక చోప్రా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఓ ప్రత్యేక పోడ్‌కాస్ట్‌లో ఆమె మాట్లాడుతూ.. భారతీయ ప్రేక్షకులు తమ అభిమాన నటీనటులపై చూపించే అభిమానం ఎంతో ప్రత్యేకమని అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ‘వారణాసి’ కార్యక్రమంలో మహేష్ బాబు అభిమానుల స్పందన తనను ఆశ్చర్యపరిచిందని, ఆయన క్రేజ్ చూసి తనకు మైండ్ బ్లాక్ అయిందని చెప్పారు. ‘వారణాసి’ తన తొలి పూర్తిస్థాయి తెలుగు సినిమా అని, తెలుగు ప్రేక్షకులు తనను, పృథ్వీరాజ్ సుకుమారన్‌ను ఆత్మీయంగా స్వాగతించడం ఆనందంగా ఉందని తెలిపారు. తెలుగు భాష తెలియకపోవడం తొలుత సవాలుగా అనిపించినప్పటికీ, రాజమౌళి తనపై ఉంచిన నమ్మకం, ప్రతి సన్నివేశంలో అందించిన సహకారం తనకు ఎంతో ధైర్యాన్నిచ్చిందని పేర్కొన్నారు.

రాజమౌళి తన పాత్ర కోసం తననే ఊహించుకున్నానని చెప్పడంతో వెంటనే సినిమాను అంగీకరించినట్లు ప్రియాంక తెలిపారు. కీలక సన్నివేశాలకు ముందే రాజమౌళి నిర్వహించే రిహార్సల్స్ నటీనటులకు ఎంతో ఉపయోగపడతాయని, షూటింగ్ సమయంలో పాత్రను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి అవి సహాయపడతాయని చెప్పారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు ప్రాక్టికల్ సెట్స్‌కు కూడా ప్రాధాన్యత ఇవ్వడం సినిమాకు సహజత్వాన్ని తీసుకొస్తుందని అన్నారు. ఆఫ్రికాలో నిజమైన క్రూరమృగాలు, ఏనుగుల మధ్య సురక్షిత వాతావరణంలో షూటింగ్ చేయడం తన కెరీర్‌లో ప్రత్యేక అనుభూతిగా నిలిచిందని పేర్కొన్నారు. ‘వారణాసి’ తనకు ఎంతో ప్రత్యేకమైన చిత్రమని, రాజమౌళి దర్శకత్వంలో తెలుగు సినిమాతో పనిచేయడం మర్చిపోలేని అనుభూతిగా నిలుస్తుందని ప్రియాంక చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంష్’ హవా

బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంష్’ హవా

ఫహాద్ ఫాజిల్ భవన స్టూడియోస్‌కు వరుస విజయాలు

ఫహాద్ ఫాజిల్ భవన స్టూడియోస్‌కు వరుస విజయాలు

సూర్య - జ్యోతికల ప్రేమకు మరోసారి పెళ్లి ప్రమాణాలు

సూర్య - జ్యోతికల ప్రేమకు మరోసారి పెళ్లి ప్రమాణాలు

‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’ సంచలనం.. మలయాళంలో సరికొత్త రికార్డు

‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’ సంచలనం.. మలయాళంలో సరికొత్త రికార్డు

‘G2’ రిలీజ్ డేట్ ఖరారు..

‘G2’ రిలీజ్ డేట్ ఖరారు..

ట్యాగ్లు
వారణాసిప్రియాంక చోప్రామహేష్ బాబుఎస్ ఎస్ రాజమౌళిపృథ్వీరాజ్ సుకుమారన్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
సినిమా రిలీజ్‌లలో అనూహ్య మార్పులు.. వాయిదా పడిన చిత్రాలివే !

సినిమా రిలీజ్‌లలో అనూహ్య మార్పులు.. వాయిదా పడిన చిత్రాలివే !

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఖైరతాబాద్‌ పేరును 'గణేష్‌పురి'గా మార్చాలి: ఎమ్మెల్యే రాజాసింగ్
జనరల్

ఖైరతాబాద్‌ పేరును 'గణేష్‌పురి'గా మార్చాలి: ఎమ్మెల్యే రాజాసింగ్

ఐబొమ్మ రవి నాంపల్లి కోర్టులో పిటిషన్
జనరల్

ఐబొమ్మ రవి నాంపల్లి కోర్టులో పిటిషన్

తెలంగాణలో నిత్యావసర ధరల భారం.. వరుసగా పెరుగుతున్న ధరలు
జనరల్

తెలంగాణలో నిత్యావసర ధరల భారం.. వరుసగా పెరుగుతున్న ధరలు

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు మంత్రి మండిపల్లికి ప్రత్యేక ఆహ్వానం
జనరల్

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు మంత్రి మండిపల్లికి ప్రత్యేక ఆహ్వానం

వైభవ్‌ సూర్యవంశీపై గోయెంకా ప్రశంసలు..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీపై గోయెంకా ప్రశంసలు..

వారణాసి మూవీ జర్నీపై ప్రియాంక చోప్రా కామెంట్స్
సినిమాలు

వారణాసి మూవీ జర్నీపై ప్రియాంక చోప్రా కామెంట్స్

బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంష్’ హవా
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంష్’ హవా

ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ
జనరల్

ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వాట్సాప్‌ వరకు.. మెటా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ఇదే!
టెక్నాలజీ

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వాట్సాప్‌ వరకు.. మెటా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ఇదే!

అరేబియా సముద్రంలో భారత నౌకను ఢీకొన్న పాక్ నేవీ నౌక
జనరల్

అరేబియా సముద్రంలో భారత నౌకను ఢీకొన్న పాక్ నేవీ నౌక

అగార్కర్ గుడ్‌బైకి రంగం సిద్ధం.. ‘థ్యాంక్యూ నోట్’ రెడీ!
క్రీడలు

అగార్కర్ గుడ్‌బైకి రంగం సిద్ధం.. ‘థ్యాంక్యూ నోట్’ రెడీ!

ఐఫోన్ డ్యూయో ధరపై వైరల్ మీమ్స్
జనరల్

ఐఫోన్ డ్యూయో ధరపై వైరల్ మీమ్స్