

గ్లోబల్ స్టార్ ప్రియాంకచోప్రా సినీ రంగప్రవేశం చేసిన తొలి చిత్రం తమిళన్. ఈ సినిమాలో ఆమె తమిళ సూపర్ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తో కలిసి నటించారు. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో గతంలో ఆయన గురించి ప్రియాంక చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘తమిళన్’ సినిమా షూటింగ్ సమయంలో విజయ్ను చూడడానికి వందలాది అభిమానులు సెట్స్‌కు వచ్చేవారని, ఆయనకు ఉన్న క్రేజ్ చూసి తాను ఆశ్చర్యపోయానని ప్రియాంక వెల్లడించారు.
ఆ సమయంలో తనకు తమిళం రాదని, డైలాగులు పేపర్‌పై రాసుకుని బట్టీ పట్టి చెప్పేదాన్నని ప్రియాంక చెప్పారు. విజయ్ డ్యాన్స్ చేసినా, డైలాగులు చెప్పినా అభిమానులు కదలకుండా చూస్తూ ఉండేవారని, వారంతా విజయ్ను దేవుడిలా భావిస్తున్నారని తనకు అనిపించిందని పేర్కొన్నారు. ప్రియాంక తల్లి మధుచోప్రా కూడా విజయ్ను జెంటిల్మ్యాన్గా అభివర్ణించారు. షూటింగ్ సమయంలో ప్రియాంకను ఎంతో గౌరవంగా చూసుకునేవారని చెప్పారు. 2002లో విడుదలైన ఈ చిత్రానికి దర్శకుడు మజిత్ కాగా, ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!