

‘సత్య గ్యాంగ్’, ‘ఫైటర్ శివ’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రభాస్ నిమ్మల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం మిరాకిల్ ఫస్ట్ లుక్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రమేష్ ఎగ్గిడి, శ్రీకాంత్ మొగదాసు, చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. పోరాట సన్నివేశాలతో మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ‘మిరాకిల్’ రెండో షెడ్యూల్ ఈ నెల 22 నుంచి హైదరాబాద్ పరిసరాల్లో ప్రారంభం కానుంది.
ఈ చిత్రంలో రణధీర్ భీసు హీరోగా, హెబ్బా పటేల్ హీరోయిన్గా నటిస్తున్నారు. అక్షర నున్న సుజన మరో కథానాయికగా కనిపించనుండగా, సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాయుడు పెండ్ర విలన్‌గా పరిచయం అవుతుండగా, సీనియర్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ ఫోరెన్సిక్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - హెబ్బా పటేల్ గ్లామర్, బలమైన యాక్షన్ బ్లాక్స్, కీలక పాత్రల్లో సీనియర్ నటులు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!