

టీమిండియా ఇటీవల ఐర్లాండ్‌పై రెండు, ఇంగ్లండ్‌పై మూడు టీ20 మ్యాచ్‌ల్లో వరుస పరాజయాలు ఎదుర్కొనడంతో జట్టు ఎంపికపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఆటగాళ్ల ఎంపికలో ప్రస్తుత ఫామ్, ప్రతిభ కంటే వ్యక్తిగత అనుబంధాలు, లాబీయింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ పలువురు నెటిజన్లు, అభిమానులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన ఓ వైరల్ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది.
వైరల్ పోస్టులో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా తదితర ఆటగాళ్ల ఎంపికపై నెటిజన్లు వివిధ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో రాణించి తిరిగి జట్టులో చోటు సంపాదించారని ప్రశంసించారు. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వ్యక్తమైన అభిప్రాయాలేనని, బీసీసీఐ లేదా సెలక్షన్ కమిటీ నుంచి ఈ ఆరోపణలపై ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!