

బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘ముకుంద’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల తార, తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రభాస్, రామ్ చరణ్, నాగ చైతన్య, అఖిల్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా 2020లో విడుదలైన ‘అలా వైకుంఠపురంలో’ సినిమా ఆమె కెరీర్‌కు భారీ బూస్ట్ ఇచ్చింది.
అయితే ఆ తర్వాత ‘గుంటూరు కారంలో’ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనప్పటికీ, ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఓజీ 2 సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ కోసం దర్శకుడు సుజీత్ వెతుకుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. మొదట కాజల్ అగర్వాల్ పేరు వినిపించినప్పటికీ, ఇప్పుడు పూజానే ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు కుదిరితే పూజా హెగ్డేకు మళ్లీ టాలీవుడ్‌లో పూర్వ వైభవం రావచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!