

అమరావతిలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రముఖ సినీ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత రాజేంద్ర ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. పద్మశ్రీ పురస్కారానికి తన పేరును సిఫార్సు చేయడంలో కీలకంగా సహకరించి, పూర్తి మద్దతుగా నిలిచినందుకు ఉప ముఖ్యమంత్రికి రాజేంద్ర ప్రసాద్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రాజేంద్ర ప్రసాద్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఘనంగా సత్కరించారు.
పద్మశ్రీ వంటి ప్రతిష్ఠాత్మక గౌరవం రావడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తనకు ఎంతో ఇష్టమైన సీనియర్ నటుడికి ఈ పురస్కారం దక్కడం పట్ల ప్రత్యేక ఆనందాన్ని వ్యక్తం చేశారు. సినిమాల ద్వారా పండించిన హాస్యం, చూపించిన సహజ నటన ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలిచిందని ప్రశంసించారు. ఈ గౌరవం రాజేంద్ర ప్రసాద్‌కు ఎంతో కాలం క్రితమే రావాల్సిందని, ఇప్పటికైనా సరైన గుర్తింపు దక్కడం సంతోషంగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు.
ప్రభుత్వం తరపున అందించిన ప్రోత్సాహం, వ్యక్తిగతంగా చూపిన ఆత్మీయతకు రాజేంద్ర ప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!