

బాహుబలి, RRR, పుష్ప వంటి భారీ హిట్లతో తెలుగు సినిమాలో క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. కానీ ఈ క్రేజ్ ఉన్నా ఇండస్ట్రీకి అది పూర్తిగా లాభంగా మారడం లేదు. ప్రతి సంవత్సరం వందల సినిమాలు రాగా, కాస్త లాభం వచ్చే చిత్రాలు మాత్రం కొద్ది మాత్రమే.
ఒక సమయంలో OTT ప్లాట్‌ఫామ్‌లు నిర్మాతలకు భరోసా ఇచ్చినవి. థియేటర్ రిస్క్ ఉన్నా, డిజిటల్ రైట్స్‌తో వారు సేఫ్ అవుతుండేవారు. అయితే ఇప్పుడు OTT మార్కెట్ పూర్తిగా మారిపోయింది.
ప్రస్తుతం OTT లు కొత్త రూల్స్ అమలు చేస్తుండటంతో నిర్మాతల పై ఒత్తిడి పెరిగింది. థియేటర్లలో సినిమా ఆశించినంత బిజినెస్ చేయకపోతే, వారు అగ్రిమెంట్ అమౌంట్లో 25 శాతం తగ్గిస్తారు. ఒకవేళ సినిమా సక్సెస్ అయితే, అదే 25 శాతం పెంచుతారు. ఈ కొత్త నెట్‌ఫ్లిక్స్ మోడల్‌ను ఫాలో అవుతున్న తొలి భారీ చిత్రం బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ 2’ కావడం గమనార్హం.
మరోవైపు, ఇటీవల నాలుగు వారాల్లోనే సినిమాలు OTT కి వస్తుండటంతో థియేటర్ రన్ బలహీనపడుతోంది. కలెక్షన్లు తగ్గిపోవడం వల్ల చాలా సినిమాలకు డిజిటల్ డీల్ కూడా తక్కువ మొత్తంలోనే వచ్చే అవకాశం ఉంది.
ఇప్పుడు అందరి దృష్టి ‘అఖండ 2’ పై ఉంది. సినిమా థియేటర్లలో ఎలా ఆడుతుందో దానిపైనే నెట్‌ఫ్లిక్స్ చెల్లించే మొత్తంలో తేడా పడనుంది. ఎక్కువ ఇస్తుందా? తక్కువ ఇస్తుందా? అన్నది చూసి తీరాల్సిందే.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!