

రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఫిబ్రవరి 7 న రీ రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి అభిమానులే కాకుండా మూవీ లవర్స్ నుంచి కూడా భారీ స్పందన లభిస్తోంది. హైదరాబాద్‌లోని మల్లికార్జున, శ్రీరాములు, భ్రమరాంబ, అర్జున్, గోకుల్, సంధ్య కాంప్లెక్స్ వంటి సింగిల్ స్క్రీన్లలో ఉదయం ఎర్లీ మార్నింగ్ షోలకు టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయి. వైజాగ్, విజయవాడ వంటి నగరాల్లో కూడా ఇదే స్థాయి క్రేజ్ కనిపిస్తోంది. తక్కువ గ్యాప్‌లోనే మరోసారి రీ రిలీజ్ చేస్తున్నప్పటికీ క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం విశేషంగా మారింది.
2010 లో మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ పై భారీ అంచనాలు ఉండేవి. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నాగబాబు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. విడుదలకు ముందే హారిస్ జయరాజ్ పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. అయితే విడుదల తర్వాత సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక డిజాస్టర్‌గా నిలిచింది. కాలక్రమేణా టీవీ, హోమ్ వీడియోల ద్వారా సినిమాకు ఆదరణ పెరిగి యూత్‌లో కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది. రీ రిలీజ్‌లతో ఈ సినిమా ట్రెండ్‌కు మించిన ఉదాహరణగా మారుతూ, కాలమే కథకు న్యాయం చేస్తుందన్న మాటను నిజం చేస్తోంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!