

తిరువీర్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘ఓ..! సుకుమారి’ చిత్ర టీజర్ సోషల్ మీడియాలో మంచి స్పందనను అందుకుంటోంది. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మాలి నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. అందమైన గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేమ, వినోదం, రాజకీయాల మేళవింపుతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతున్నట్లు టీజర్ స్పష్టం చేసింది.
ఈ చిత్రంలో తిరువీర్ యాదగిరి అనే యువ రాజకీయ నాయకుడిగా కనిపించగా, ఐశ్వర్య రాజేష్ దామిని అనే అల్లరి స్వభావం కలిగిన పల్లెటూరి అమ్మాయిగా అలరించనుంది. యాదగిరి ఆమెను రాజకీయాల్లోకి తీసుకురావడం, వారి మధ్య ప్రేమ చిగురించడం, ఆ ప్రేమ పెళ్లికి దారితీయడం కథలో ప్రధానాంశాలు. అయితే పెళ్లి తర్వాత వారి జీవితాల్లో చోటుచేసుకునే ఊహించని పరిణామాలు, గ్రామస్తులు వారిని ఎందుకు తరుముతున్నారు అనే అంశాలు కథపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!