

భాగ్యనగరంలో క్రమక్రమంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాయమవుతూ వాటి స్థానంలో మల్టీప్లెక్స్ థియేటర్లు వచ్చి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హార్ట్ ఆఫ్ ది సిటీగా చెప్పుకునే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పేరెన్నికగన్న సుదర్శన్ 70ఎంఎం, ఓడియన్, మయూరి వంటి థియేటర్లు మూతబడి సినీ లవర్స్‌కు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఆపై క్రమంగా ఆ ప్రాంతం కళ లేక వెలవెల పోయింది. ఈ నేపథ్యంలో సినిమాలకు గుండెకాయలా చెప్పుకునే ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో దాదాపు ఒకటిన్నర దశాబ్దం క్రితం మూత పడిన ఓడియన్ సినిమాస్ ఇప్పుడు ఐనాక్స్ ఓడియన్ మాల్గా పునః ప్రారంభమైంది. మొత్తం 8 స్కీన్లతో బుధవారం రాత్రి షోలతో సినిమా ప్రదర్శనలు మొదలు పెట్టారు. దీంతో నగరంలో కొత్తగా మరో మల్టీప్లెక్స్ అందుబాటులోకి వచ్చినట్లైంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!