

‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్రపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు రామ్ చరణ్ నటనకు ప్రశంసలు లభిస్తుండగా, మరోవైపు జాన్వీ పాత్రను చూపించిన తీరు పై ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పి వివాదాస్పద సన్నివేశాలను తొలగిస్తామని ప్రకటించినప్పటికీ వివాదం ఆగలేదు. ఇప్పటికే డింపుల్ హయాతీ, అషికా రంగనాథ్తో పాటు పలువురు సినీ తారలు స్పందించారు.
తాజాగా నిత్యామీనన్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ సినిమాల్లో మహిళలను వస్తువులా చూపించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. తాను సినిమా చూడకపోయినా జాన్వీకి మద్దతు ఇస్తున్నానని చెప్పారు. ఇది కేవలం దక్షిణాది పరిశ్రమలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య అని అభిప్రాయపడ్డారు. వాణిజ్య ఒత్తిళ్ల కారణంగా పాత్రలను అతిగా చూపిస్తారని, అలాంటి పాత్రలను హీరోయిన్లు తిరస్కరించాలని సూచించారు. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన పొందినప్పటికీ మూడు రోజుల్లో రూ. 236.7 కోట్ల వసూళ్లు సాధించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!