

సౌమిత్ పోలాడి హీరోగా, సాయి కే వెన్నం దర్శకత్వంలో రూపొందిన ప్రేమకథా చిత్రం ‘నిలవే’ ఫిబ్రవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీవోవీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మించారు. శ్రేయాసి సేన్ ఈ చిత్రంతో కథానాయికగా పరిచయం అవుతున్నారు. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జంటగా నటించారు.
మాదాపూర్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు గాయని సునీత ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమా భావోద్వేగాలతో నిండిన మ్యూజికల్ లవ్ స్టోరీగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. క్లాసిక్ ప్రేమకథల మాదిరిగా మంచి అనుభూతిని ఇచ్చే చిత్రమని అభిప్రాయపడ్డారు.
హీరోయిన్ శ్రేయాసి సేన్ సంగీతం, సంభాషణలు తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. యువతకు దగ్గరగా ఉండే కథగా ఈ చిత్రం నిలుస్తుందని చెప్పారు. హీరో సౌమిత్ పోలాడి ఈ చిత్రం తన తొలి ప్రయాణమని, ప్రేక్షకుల ఆదరణే తమకు ప్రధాన బలం అని అన్నారు. లవ్ స్టోరీల్లో ఈ చిత్రం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
దర్శకుడు సాయి కే వెన్నం కంటెంట్ మీదే తమ నమ్మకం అని, ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని తెలిపారు. సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్ ప్రేమకథలో సంగీతం కీలకమని, కథతో కలిసి నడిచే 11 పాటలు ఈ చిత్రానికి ప్రత్యేకతగా నిలుస్తాయని చెప్పారు.
ప్రీమియర్‌కు మంచి స్పందన వచ్చినట్లు నిర్మాతలు వెల్లడించారు. కొత్తవారితో రూపొందిన ఈ మ్యూజికల్ లవ్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!