
సినిమాలు

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను మేకర్స్ వేగవంతం చేశారు. ఇప్పటికే ముంబైలో విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇదిలా ఉండగా, భోపాల్‌లో భారీ ఈవెంట్ నిర్వహించనున్నట్లు వస్తున్న వార్తలను నిజం చేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
‘పెద్ది కి ఆవాజ్’ పేరుతో ఈ భారీ ఈవెంట్ మే 23న సాయంత్రం 5 గంటల నుంచి BHEL దసరా మైదానంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనుండగా, సినిమాలోని ప్రత్యేక గీతాన్ని కూడా విడుదల చేయనున్నారు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!